ఒకప్పుడు సినిమాలో నటించే వారిని చూడాలంటే అదొక గొప్ప విషయంగా చూసే వారము. ఆనాటి నటులు తమ నటనతో హావ భావాలతో ప్రజల మనసులను గెలుచుకుని చాలా కాలం ఒక వెలుగు వెలిగారు. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే టోటల్ డిఫరెంట్. ఇప్పుడు కాస్త పొడవు.. తెల్లగా ఉంటే సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారని గ్యారంటీ లేదు. కొన్ని సార్లు అందం, అభినయం, నటన ఉన్నా ప్రేక్షకులు ఆదరించ లేకపోవచ్చు. మరి కొందరి విషయంలో నటనతో పని లేకున్నా అందంగా లేకున్నా ప్రజలు ఆదరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము చూస్తున్న ఫాస్ట్ జనరేషన్ లో సోషల్ మీడియా ఎంతగా మన జీవితాలను ప్రభావితం చేస్తోందో చూస్తున్నాము.

ఇప్పుడు టాలీవుడ్ లో కొద్ది మంది హీరోయిన్ లు మాత్రమే అగ్ర స్థాయిలో ఉన్నారు. మరి కొందరు సినిమాలు వరుస పెట్టి చేస్తున్న అగ్ర స్థాయి లోకి రావడం లేదు. ఇంకా కొందరు అవకాశాలు రాక పరిశ్రమ చుట్టూ తిరుగుతున్నారు. కొందరు టాలెంట్ ను నమ్ముకుంటూ ఉంటే, ఇంకా కొందరు అవకాశాల కోసం తమ గ్లామర్ ను ఒలక బోస్తూ సినీ దర్శక నిర్మాతలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. గత కొంత కాలంగా ఇదే పంథా కొనసాగుతోంది. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం వర్ధమాన హీరోయిన్ లు తెలుసుకోవలసిన అవసరం ఉంది.

ఎవరైతే తమ అందాల విందును సినిమా అవకాశాల కోసం ఇలా చేస్తున్నారో...  అవకాశం రావడం ఈజీ కావొచ్చు. కానీ దానిని నిల దొక్కుకుని కొంతకాలం వరకు ఆ ఛరిస్మాను నిలబెట్టుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అయినట్లు. కానీ సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అందాన్ని బట్టి అవకాశాలు రావు. కేవలం టాలెంట్ ఉంటేనే ఇక్కడ రాణించగలరు అని నొక్కి చెబుతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: