గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తమన్ ఏ రేంజ్లో తన టాలెంట్ ను చూపిస్తున్నాడో అందరికీ తెలిసిందే. ఆయన సంగీతం అందించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా సంగీతం పరంగా కూడా తనకు మంచి పేరు తీసుకు వస్తుంది. ఆ విధంగా తమన్ ఎప్పుడూ లేని స్టార్ డం లో ఉన్నాడు ఇప్పుడు. దాంతో ఆయన అభిమానులు ఈ తమన్ ప్రభంజనాన్ని చూసి ఎంతగానో సంబరపడుతున్నారు. చిన్న సంగీత దర్శకుడిగా ప్రేక్షకులముందుకు వచ్చినా తమన్ మొదటినుంచి పెద్ద హీరోల సినిమాలు చేయడం విశేషం. అందుకే కాబోలు ఆయనకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు తొందరగా వచ్చేసింది.

వేలకొద్ది సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన తమన్ పెద్ద సంగీత దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పని చేసి ఇప్పుడు ఈ స్థాయిలో సినిమాలు చేయడం విశేషం. అయితే ఎప్పుడైతే ఆయన పాటలు ప్రేక్షకులకు బాగా నచ్చడం మొదలుపెట్టాయో ప్రయోగాలు కూడా చేసి వాటి ద్వారా ప్రేక్షకులను అలరింప చేశాడు. ఆయన సంగీతం అందించిన అల వైకుంఠపురం లో సినిమా ఎంత పెద్ద విజయం అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా సాధించిన విజయం కంటే పాటలు సాధించిన విజయమే ఎక్కువ. తమ దేశవ్యాప్తంగా తమన్ కు ఈ సినిమా తో మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు.

అయితే అప్పటి నుంచి తనదే ఆధిపత్యం గా కొనసాగుతున్న తనున్ కు తొలిసారి ఎదురు దెబ్బ తగిలింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప సినిమాలోని పాటలు ప్రేక్షకులను విపరీతంగా అలరించడం తో నెంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చినట్లు అయింది. ఏదేమైనా గతంలో దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీతం అందించగా ఈ మధ్యకాలంలో ఆయన మంచి పాటలను ఇవ్వడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ విమర్శలు వస్తున్న నేపథ్యంలో తనకు హిట్ కావలసిన సమయంలో పుష్ప సినిమా ద్వారా దేవీశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరింప చేయడం ఆయన కం బ్యాక్ ఆయన అయినట్లు అయింది. మరి ఎంతో ఆరోగ్యవంతమైన పోటీ ఈ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సంగీత దర్శకుల మధ్య నెలకొన్న నేపథ్యంలో తమన్ మళ్లీ ఎలాంటి పాటలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: