ప్రపంచంలో ప్రతి రోజు కూడా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని దాన్ని వేడుకగా చేసుకుంటున్నారు ప్రజలు. పండగలు, ఉత్సవాలే కాదు నార్మల్ రోజు లలో కూడా ఒక సందర్భాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలా ఈరోజు ప్రపంచ కౌగిలింతల దినోత్సవం. కౌగిలి లేదా కౌగిలింత అనే సాంఘిక ప్రక్రియ ను ప్రోత్సహించేందుకు ఈరోజు ఉద్దేశించబడింది. ప్రతి సంవత్సరం జనవరి 21 న దీన్ని జరుపుకుంటారు. మొట్ట మొదటిసారిగా 1986 జనవరి 21వ తేదీన అమెరికాలోని మిచిగాన్ లో ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు.

అపరిచితులను కౌగిలించుకోవడం అనే సంప్రదాయం ఇక్కడినుంచే మొదలైంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెనడా ఇంగ్లాండ్ జర్మనీ లలో ఈ రకమైన సంప్రదాయం మొదలైంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ సంప్రదాయం ఆ దేశాలలో కొనసాగుతోంది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం దీన్ని ఆచరిస్తూ వస్తుంది. రాను రాను ఈ రోజుకు విశిష్టత కూడా పెరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులను స్నేహితులను కౌగిలించుకునేలా ప్రోత్సహించడం.

అంతే కాదు ప్రస్తుతం ప్రజలలో ఉన్న ఒత్తిడి నీ కూడా దూరం చేస్తుంది. వారి మైండ్ ఫ్రీ గా పని చేయడానికి వారు మంచి విజయం సాధించడానికి ఈ రోజు ఉపయోగ పడుతుంది అని చెబుతున్నారు. ఈ ఫార్ములాను ఫాలో అవుతూ చాలామంది ఒత్తిడినుంచి దూరం అయ్యానని చెప్పారు. ఒక కౌగిలింత విలువ చాలా ఉంది అని కొంతమంది వెల్లడించారు. ఈ ప్రపంచంలో ఎంతో మందిలో ద్వేషం ఉంది. దాన్ని తగ్గించాలి. ప్రేమను అందరికి పంచాలి అందుకే అపరిచితులతో కూడా ఈ కౌగిలింతలు ఈరోజు చేసుకోవచ్చు. దీని ప్రధాన ఉద్దేశం ఇది. ఈ హగ్ ఒక మ్యాజిక్ లా పనిచేస్తుంది అని ఇలా చేసిన వారు చెబుతున్నారు. ప్రతి ఏడాది కూడా సెలబ్రిటీలు సైతం ఈ రోజు జరుపుకుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: