కొంత కాలం క్రితం వరకు థియేటర్ లలో విడుదలైన సినిమాలు ఓటిటి లోకి రావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతూ ఉండేవి, కాని ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితులు కనబడడం లేదు,  కొన్ని సినిమాలు నేరుగా ఓటిటి లోనే విడుదల అవుతూ ఉంటే మరికొన్ని సినిమాలు మాత్రం థియేటర్ లలో విడుదల అయినప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఓటిటి లోకి వచ్చేస్తున్నాయి, కొంత మంది స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కొంత ఆలస్యంగా ఓటిటి లోకి వస్తున్నాయి,  చిన్న హీరోల సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర మంచి టాక్ ను సంపాదించుకొనట్లు అయితే ఆ సినిమాలు  అతి తక్కువ కాలంలోనే ఏదో ఒక ఓటిటి లోకు వచ్చేస్తున్నాయి. ఇదిలా ఉంటే  ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదలైన హీరో సినిమా కూడా మరికొద్ది రోజుల్లోనే ఓటిటి లోకి రాబట్టినట్లు తెలుస్తోంది, అశోక్ గల్లా హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన హీరో సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీన థియేటర్ లలో విడుదలైంది, ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు.

 ఈ సంవత్సరం సంక్రాంతికి నాగార్జున హీరోగా తెరకెక్కిన బంగార్రాజు సినిమాను మినహాయిస్తే ఏ పెద్ద హీరో సినిమా కూడా హీరో సినిమాకు పోటీగా లేకపోవడం అలాగే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లను బాగానే రాబడుతోంది, అశోక్ గల్లా కు ఇది మొదటి సినిమా . ఈ సినిమాను ఫిబ్రవరి 13 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్ ల దగ్గర పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని కలెక్షన్ లను  బాగా రాబడుతున్న ఈ సినిమా ఓటిటి లో ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: