టాలీవుడ్ మన్మధుడు అయిన అక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడట.ఈ మధ్యే ఆయన నటించిన బంగార్రాజు సినిమాతో మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడని తెలుస్తుంది.


నాగ చైతన్య తో కలిసి నటించిన కూడా కొడుకుకి మించి యాక్టివ్ గా కనిపించాడని.. ఈయన ఇప్పటికి యంగ్ గా కనిపిస్తున్నాడు అంటూ మహిళ అభిమానులు ఆయనను పొగుడుతూనే ఉంటారట...

అయితే తాజాగా తన వయసు గురించి నాగ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడట.. ఎప్పుడు కూడా వయసు ఎక్కువ అంటే నేను ఒప్పుకోను అని చెప్పే నాగార్జున ఇప్పుడు మాత్రం వయసుకు తగ్గట్టుగా వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్య పరుస్తుందట. ఆయన తన వయసుకి తగ్గట్టుగా సినిమా చేస్తానంటూ తాజా ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు 

అయితే నాగార్జున కూడా ఆ తరహా సినిమా చేస్తే బాగుంటుంది అని ఆయన అభిమానులు అనుకుంటున్నారట... కానీ ఈ విషయంపై నాగార్జున స్పందించిన తీరు అభిమానులను నిరాశ కలిగించిందని . హీరోగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి కానీ స్పోర్ట్స్ డ్రామా కథతో సినిమాలు చేయలేను అంటూ నాగ్ తెలిపాడట.
ఇప్పుడు ఉన్న వయసులో నేను స్పోర్ట్స్ డ్రామా సినిమాలను చేయలేను అంటూ ఆయన తేల్చి చెప్పాడట.. స్పోర్ట్స్ కథలు అంటే ఫిజికల్ గా చాలా కష్టపడాల్సి ఉంటుందని అందుకే ఈ వయసులో ఆయన మంచి ఫిజిక్ తో ఉన్న ఫిజికల్ గా కష్టపడే సినిమాలను చేయడం కష్టమేనని తెలుస్తుంది.అందుకే నాగార్జున ఇలా చెప్పి ఉంటాడని అంతా అనుకుంటున్నారట.. కరోనా థర్డ్ వేవ్ పూర్తి అయినా తర్వాత ది గోస్ట్ సినిమా మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందని సమాచారం.అయితే ఏది ఏమైనా కానీ నాగార్జునకు తన వయసు తగ్గ పాత్రలు ఎంచుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: