బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ లో దూసుకు పోతున్నారు. ఆ షో ద్వారా ఫెమస్ అయిన వారితో సినీ నిర్మాతలు కూడా ఇలా క్యాష్ చేసుకొనే ప్లాన్ చెస్తున్నారు.ఇప్పటికే చాలా మంది వరుస సినిమాలలొ నటిస్తూ బాగా పాపులర్ అవుతున్నారు.. గత రెండు సీజన్ లలొని సెలెబ్రిటీలు ఎక్కువగా సినిమాలో నటించె చాన్స్ ను అందుకున్నారు. కొందరు షో లు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ 5 సీజన్ కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇందులో కనిపించిన వాళ్ళు సినిమాలతో బిజిగా ఉన్నారు...


ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ లో అలరించిన ట్రాన్స్‏జెండర్ ప్రియాంక సింగ్ కూడా సినిమాలో నటించె అవకాశాన్ని అందుకుందని తెలుస్తుంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు టాప్ 7 వరకు కొనసాగింది. తన ఆట తీరుతో అందరినీ తెగ ఆకర్షించాయి. మానస్‏తో స్నేహం.. అతనిపై ఓవర్ కన్సార్న్ చూపించడంతో కొద్ది శాతం ప్రియాంక నెగిటివిటిని కూడా మూటగట్టుకుంది. ఆ సమయంలో ప్రియాంకపై ట్రోలింగ్ కూడా ఓ రేంజ్‏లో ఏర్పడింది. దాంతో అమ్మడు క్రేజ్ కాస్త తగ్గిపోయింది..


అలా 19 మంది కంటెస్టెంట్ల తో మొదలైన బిగ్ బాస్ షోలో టాప్ 7లో ఒకరిగా నిలిచింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మడు కు మంచి ఆఫర్లు కూడా వచ్చాయి.సినిమా ఆఫర్లు వస్తున్నట్లుగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలోనూ నాగార్జునకు చెప్పింది ప్రియాంక. తాజాగా ప్రియాంక తన ఇన్‏స్టాలో ఓ ఫోటో షేర్ చేసుకుంటూ కోన వెంకట్‏ను కలిసినట్టు తెలిపింది. ఆయనతో సమయం గడపడం చాలా సంతోషంగా వుంది. ఆయనతో త్వరలోనే సినిమా లో నటిస్తాను అంటూ బిగ్ బాస్ బ్యూటీ చెప్పుకొచ్చింది... మరి ఆ సినిమాలో ఎటువంటి పాత్రలో నటిస్తుందొ చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: