అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంతటి స్థాయిలో ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా విడుదలై నెల 15 రోజులు కావస్తున్నా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా భారీ స్థాయిలో ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటుంది అంటే ఈ సినిమా మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాలలోని ప్రజలు సైతం ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు చేస్తుంటే ఈ చిత్రం యొక్క క్రేజ్ అక్కడ కూడా బాగానే ఉంది అని చెప్పవచ్చు. ఈ సినిమా ను సుకుమార్ ఎప్పుడు మొదలు పెట్టాడో తెలియదు కానీ నిర్మాతలకు వసూళ్ల వర్షం కురుస్తుంది అని చెప్పొచ్చు.

వాస్తవానికి డిసెంబర్ 17 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడం సినిమా బృందానికి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 17వ తేదీ తర్వాత ఏ పెద్ద సినిమా కూడా ప్రేక్షకులను పలకరించ లేక పోయింది. దాంతో అల్లు అర్జున్ సినిమా ఏకైక పెద్ద హీరో సినిమా కావడంతో ఒక్కసారిగా ఆ చిత్రం భారీ స్థాయిలో ఆదరణ అందుకుంది అని చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా ఏ ఒక్క చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో పెద్ద సినిమాల విడుదల వాయిదా పడటంతో ఈ సినిమానే కింగ్ మేకర్ అయింది.

ఆ విధంగా కలిసి రావడంతో పుష్ప సినిమా కు ఎదురు లేకుండా పోయింది. ఫిబ్రవరిలో సైతం పెద్ద సినిమాల విడుదలలు లేకపోవడంతో ఈ సినిమా ఫిబ్రవరి దుమ్ము దులిపే విధంగా రంగం సిద్ధం చేసుకుంటుంది. పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంతో గ్రాండ్ గా అడుగు పెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు 100 కోట్ల హీరోగా ఎదగడం నిజంగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అల్లు అభిమానుల ఆనందం కు అంతులేకుండా పోయింది అని చెప్పాలి. మరి భవిష్యత్తులో ఈ హీరో ఇంతటి స్థాయికి చేరుకుంటాడో చూడాలి. ఇక పుష్ప రెండవ భాగం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఆ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: