క‌రోనా కార‌ణంగా మెగాస్టార్ చిరు కాస్త న‌ల‌తకు గురయ్యారు. భోళాశంక‌ర్ షూట్ లో ఆయ‌న‌కు క‌రోనా నిర్థార‌ణ కావ‌డంతో యూనిట్ లో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలే కావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్యానికి సంబంధించిన వివ‌రాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు.త్వ‌ర‌లోనే కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.అదేవిధంగా ఆరోగ్యం విష‌య‌మై తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి వివ‌రించారు.దీంతో అటు మెగాభిమానులు, ఇటు టీఆర్ఎస్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో హోం ఐసోలేష‌న్‌లో ఉన్న చిరూను ఓ కుటుంబ పెద్ద హోదాలో కేసీఆర్ ప‌ల‌క‌రించ‌డం ఎంతైనా సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని మెగాభిమానులు ఫిదా అయిపోతున్నారు.


ప్ర‌స్తుతం చిరు హోం ఐసోలేష‌న్ లోనే ఉన్నారు. ప్ర‌స్తుతానికి స్వ‌ల్ప ల‌క్ష‌ణాలే  ఉన్నాయ‌ని వైద్యులు తేల్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌వ భోళా శంక‌ర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకున్నా కూడా త‌న‌కు క‌రోనా రావ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని మెగాస్టార్ వ్యాఖ్యానించారు.అయినా త‌న ఆరోగ్యం విష‌య‌మై ఎవ్వ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని, త్వ‌ర‌లోనే కోలుకుంటాన‌ని చిరు ధీమాగా చెబుతున్నారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వ‌స్తాన‌ని కూడా ఆయ‌న అంటున్నారు.షూటింగ్ సంద‌ర్భంగా ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారు లేదా వేర్వేరు సంద‌ర్భాల్లో త‌న‌ను క‌లిసిన వారు క‌రోనా టెస్టులు త‌ప్ప‌క చేయించుకోవాల‌ని కూడా విన్నవించారు.


గ‌తంలో ఓసారి క‌రోనా వ‌చ్చింద‌న్న అనుమానాలు వెల్లువెత్తాయి.అప్పుడు ఆచార్య షూట్ లో ఉన్నారు చిరు. ఆరోజు ఆర్టీపీసీఆర్ టెస్టుల‌లో త‌ప్పిదం కార‌ణంగా ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని తేల్చారు.త‌రువాత మ‌ళ్లీ టెస్టులు చేయించ‌గా మెగాస్టార్ కు క‌రోనా లేద‌ని నిర్థారించారు.గ‌త అనుభ‌వాల దృష్ట్యా ఈసారి టెస్టులు జాగ్ర‌త్త‌గా చేసి మ‌రీ! క‌రోనాను నిర్థారించారు.అయితే ఆయ‌న ఆరోగ్య విష‌య‌మై ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని అయినా ఇలా జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌ని భోళాశంక‌ర్ యూనిట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: