ఈ క్రమంలోనే గుంటూరు టాకీస్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులందరినీ ఆకర్షించి మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ చేసిన రెండు సినిమాలను కూడా ఓటీటీ వేదికగా విడుదల చేశారు అన్న విషయం తెలిసిందే. రెండు సినిమాలతో మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం డీజే టిల్లు అనే ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే అయితే ఈసారి ఓటిటి వేదికగా కాకుండా థియేటర్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా చివరికి వాయిదా పడింది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ యూత్ అందరినీ ఆకర్షించింది అని చెప్పాలి. సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఇకపోతే ఇటీవలే ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అని నిర్మాతలు తెలిపారు. ఇక ఈ సినిమాతో విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతుండగా సిద్ధు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ పై నాగ వంశీ సినిమా నిర్మిస్తుండటం గమనార్హం. అయితే హీరో హీరోయిన్ లిప్ లాక్ పెట్టుకుంటున్న ఒక ఫోటో ని విడుదల చేస్తూ ఈ సినిమా థియేటర్లకు వచ్చే తేదీని ప్రకటించారు నిర్మాతలు కాగా ఇదే రోజు రవితేజ ఖిలాడి సినిమా కూడా విడుదల కాబోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి