ప్రముఖ దర్శకుడు పరుశురాం డైరెక్షన్లో సర్కార్ వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే సుమారుగా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకోవడం మిగిలిన 40 శాతం షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చిత్రబృందం కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. సాధారణంగా ఏ సినిమా అయినా సరే ప్రమోషన్స్ మొదలయ్యాక ఆ సినిమాకు టిక్కెట్లు బుక్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు ఇంకా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు .. కానీ అప్పుడే బుక్ మై షో లో కనివిని ఎరుగని రీతిలో ఏకంగా లక్ష టికెట్లు అమ్ముడుపోయినట్టు తాజా సమాచారం.
ఇక ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేయడంతోపాటు టిక్కెట్లు దొరుకుతాయో లేదో అని ఇప్పటి నుంచే వారు కూడా టికెట్స్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక చెల్లి పాత్రలతో ప్రేక్షకులను అలరించిన కీర్తి సురేష్ ఈసారి మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి మే 12వ తారీకు చాలా ఘనంగా థియేటర్లలో విడుదల చేస్తామని చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్ ను విడుదల చేసి మరి స్పష్టం చేయడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి