అప్సర రాణి అనగానే ఆర్జివి చేసిన సినిమాలు గుర్తుకొస్తాయి.. ఆయనతో కలిసి అప్పుడప్పుడు కొన్ని విశేషాలను కూడా వేస్తూ ఉంటుంది ఈ అమ్మడు. ఇక ఈమె అప్సర రాణి అంటే రాంగోపాల్ వర్మ అనే పేరు గుర్తుకు వచ్చేలా పాపులర్ అయింది. అయితే వీరిద్దరు గోవాలో బాగా సందడి చేసినటువంటి కొన్ని ఫోటోలు అప్పట్లో ట్రెండీగా మారాయి. గత సంవత్సరం కూడా బర్తడే పార్టీ లంటూ ఎక్కువగా గోవాలోనే సందడి చేశారు. ఇక అప్పుడప్పుడు వీరిద్దరూ కలిసి ట్విట్టర్ లో పెట్టుకునే కొన్ని ముచ్చట్లు వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ ఈ మధ్య హీరోయిన్లతో మరింత చనువుగా ఉంటున్నాడు.


అయితే తాజాగా అప్సర రాణి గోవాలో ఉన్నది.. బీచ్ లో బికినీ ధరించిన ఫోటో తో హ్యాపీ సండే అని పోస్ట్ చేయడం జరిగింది.. ఇలా పోస్ట్ చేసిందో లేదా ఆర్జివి తనలోని మన్మధుడిని బయటకు తీసుకువచ్చాడు. ఇక వర్మ నువ్వు ఇక్కడ లేకుండా అక్కడ ఏక్కడో ఉండి హ్యాపీ సండే అంటే ఎలా అని కామెంట్ చేశాడు. దీంతో అప్సర రాణి  మరింత ఘాటుగా స్పందించింది. అయితే ఈ వీడియో షేర్ చేస్తాను మీకు మరింత ఫీలింగ్ వస్తుంది అని అప్సర రిప్లై ఇవ్వడం జరిగింది.ఇక ఆర్జీవి దానికి దీనికి ఏమి తేడా లేదు అని సెటైర్ వేసాడు. దీన్ని బట్టి చూస్తే రాంగోపాల్ వర్మ కు అప్సర రాణి లేని లోటు బాగా కనిపిస్తోంది అని చెప్పవచ్చు.. ఇక వర్మ ను సెట్లో కలిసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ అప్సర కామెంట్ రూపంలో తెలియజేసింది. ప్రస్తుతం వర్మ ఎక్కువగా అప్సర రాణి తోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత సంవత్సరం కూడా ఓటిటి లో అప్సర రాణి సందడి చేసింది.. ఒక ఐటెం సాంగ్ లో కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: