ఈ ఫోటో చూసిన అందరూ కూడా గౌతమ్ అలాగే సితార ఆడుకుంటున్నట్టు గా మనకు కనిపించింది.. అయితే అందరూ సరదాగా అన్నా చెల్లెలు ఆడుకుంటున్నారు అని అనుకునే లోపే అక్కడ ఉన్నది గౌతమ్ కాదు మహేష్ బాబు అంటూ మరో ఫోటో షేర్ చేసి అసలు విషయం రివీల్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.. అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసి అభిమానులకు షాక్ ను కలిగించింది నమ్రత.. గౌతమ్ కూడా ఈ మధ్య కాలంలో మహేష్ బాబును మించి పోయేలా హైట్ పెరిగాడు.. అంతేకాదు ఫిజిక్ విషయంలో తండ్రికి ఏ మాత్రం తగ్గడం లేదని చెప్పవచ్చు. ఇక వెనుకనుంచి చూస్తే మహేష్ బాబు.. గౌతమ్ ఎవరు ఉన్నారా అని గుర్తు పట్టడం చాలా కష్టం.
మహేష్ కూడా కొడుకు తో పోటీ పడుతూ మరీ యంగర్ గా కనిపిస్తున్నాడు.. వీరిద్దరిని తండ్రీకొడుకులు అనడం కంటే అన్నా తమ్ముడు అని అనడం లో మజా ఉంటుందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా నమ్రత షేర్ చేసిన ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి