కొన్ని సినిమాలు విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి ఆలోచనలు కలిగి ఉంటాయి,  దానికి ప్రధాన కారణం ఆ సినిమాలో స్టార్ హీరోలు నటించడం కావచ్చు,  లేకపోతే ఆ సినిమాకు స్టార్ దర్శకుడు దర్శకత్వం వహించడం అయి ఉండవచ్చు,  ఇలా కొన్ని కారణాల వల్ల కొన్ని సినిమాలపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడతాయి,  అయితే అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న సినిమాల నుండి విడుదల చేసిన పాటలకు కూడా కొన్ని సందర్భాలలో అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది,  కానీ ఈ సినిమా విడుదల అయిన తర్వాత సాంగ్స్ ఉన్న రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోయినట్లు అయితే ప్రేక్షకులు నిరుత్సాహ పడవలసి వస్తుంది,  అదే కనుక ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సాంగ్స్ రేంజ్ లో అలరించినట్లు అయితే ఆ సినిమా విజయంలో మరింత ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ అంచనాలు కలిగి ఉన్న సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్,  రానా హీరోలుగా నటించడం వల్ల ప్రేక్షకుల్లో మొదటి నుండి ఈ సినిమాపై అంచనాలు కలిగి ఉన్నాయి. దానికి తగినట్టుగానే ఈ సినిమా నుండి విడుదల చేసిన సాంగ్స్ కి కూడా ఇప్పటికే ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది, ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం తో కూడా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.  ఇది ఇలా ఉంటే ఇలా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఈ రోజు అనగా ఫిబ్రవరి 25 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది, అయితే ఇప్పటివరకు సాంగ్స్ తో సినిమా పై అంచనాలు పెంచిన తమన్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా అదే రేంజ్ లో మ్యాజిక్ చేసినట్లు తెలుస్తోంది, ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం తమన్ ఈ సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: