మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్న సమయం లోనే రాజకీయాల వైపు దృష్టి మళ్లించి సినిమాలకు కొన్ని సంవత్సరాల పాటు దూరం అయ్యారు,  ఆ తర్వాత మళ్లీ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 తో సినిమాతో తిరిగి మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు,  ఈ సినిమా మంచి విజయం సాధించింది,  ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి హీరోగా నటించాడు,  ఈ సినిమా కూడా మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా రీ ఎంట్రీ తర్వాత నటించిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరస పెట్టి క్రేజీ సినిమాలో నటిస్తున్నాడు,  అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా ఏప్రిల్ 29 వ తేదీన విడుదల కాబోతుంది.

 మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో పాటు భోళా శంకర్,  గాడ్ ఫాదర్,  బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, అయితే భోళా శంకర్ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో  మెగాస్టార్ చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది,  చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న  ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాను దసరా  సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి,  ఇప్పటి వరకు భోళా శంకర్ సినిమాకు సంబంధించి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి,  వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: