గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పక్కా కమర్షియల్. ఆయనకు సరైన విజయం వచ్చి చాలా రోజులు అయిపోయింది అని చెప్పవచ్చు. లౌక్యం సినిమా తర్వాత ఇప్పటివరకు అంతటి స్థాయిలో విజయాన్ని ఆయన అందుకోలేదు. దాంతో ఆయన ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తమ సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు. వరుసగా ఆయన చేస్తున్న చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నా కూడా అవి భారీ స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాయి. సాదాసీదా కలెక్షన్ల తోనే తమ సినిమా వెళ్ళిపోతుంది. అలా మారుతి దర్శకత్వంలో చేస్తున్న పక్కా కమర్షియల్ చిత్రం భారీ స్థాయిలో చేసే విధంగా ముందుకు వెళ్ళాడు.

 ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా మంచి కామెడీతో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో తెరకెక్కించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ చిత్రం గోపీచంద్ కు ఏ విధమైన విజయాన్ని కలుగజేస్తుందో చూడాలి. మొత్తానికి ఈ చిత్రం తర్వాత కూడా గోపీచంద్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్న చిత్రాన్ని ఓకే చేయడం విశేషం. ఆయన సినిమాలు పెద్దగా అలరించకున్నా కూడా తన యాక్షన్ తో యాక్షన్ సీక్వెన్స్ తో ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకుంటున్నాడు. అయితే పక్కా కమర్షియల్ సినిమా విషయంలో ఆయనకు అన్నీ కలిసి వస్తున్నట్లు గానే చెప్పాలి.

సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ హక్కులు భారీగానే అమ్ముడు పోయాయట. దీన్ని బట్టి ప్రేక్షకులు ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ రానుంది. ఈ చిత్రం తర్వాత దర్శకుడు మారుతి ప్రభాస్ తో సినిమా చేస్తున్ విషయం తెలిసిందే. ఇప్పటివరకు చిన్న సినిమాలను చిన్న తరహా సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చిన మారుతి తన కథా బలంతో ప్రభాస్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేయడం మొదలు పెడుతున్నాడు. మరి ఆ సినిమాపై మరిన్ని అంచనాలు పెరగాలంటే ఈ సినిమా కూడా బాగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: