
మున్నా మూవీ స్క్రిప్ట్ దగ్గరే నాకు ఇబ్బంది అయింది, కానీ దర్శకుడు వంశీ పైడిపల్లి ఒప్పుకోలేదు. రైటర్ కొరటాల శివ కూడా మొన్న స్క్రిప్ట్ బాగుంది అని అన్నాడు, అక్కడ నేను కూడా తగ్గాను. దర్శకుడు వంశీ పైడిపల్లి ని నమ్మను, మొదటి రోజు రిలీజ్ షో చూశాను. నేరుగా ప్రభాస్ దగ్గరికి వెళ్లాను, ఆ సమయం లో ప్రభాస్, వాళ్ల ఫ్రెండ్స్ హిట్ కొట్టేశాం అనే ఆనందం లో ఉన్నారు. నేను ప్రభాస్ దగ్గరికి డైరెక్టు గా వెళ్లి సారీ చెప్పాను, హిట్ మూవీ లేకపోయాను అన్నాను. ప్రభాస్ ఫ్రెండ్స్ అంతా షాక్ అయ్యారు, ప్రభాస్ కూడా మూవీ బాగుందని వాదించాడు, నేను మాత్రం ఒప్పు కోలేదు. మున్నా మూవీ యావరేజ్ సినిమా అని చెప్పాను, మెంటల్లీ ప్రిపేర్ అవ్వమని చెప్పేశాను. ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ప్రభాస్ మూవీ 9 సెంటర్ లో 100 రోజులు ఆడింది అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు.