తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా పేరుపొందిన వాడు హీరో గోపీచంద్. సిటీ మార్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు గోపీచంద్. ఇక ఆ తర్వాత డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ తో ఒక హ్యాట్రిక్ మూవీ ని సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం లక్ష్యం. ఇక ఈ సినిమా ఎంత ఘన విజయం అందుకుందో మనకు తెలిసిన విషయమే. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సాధించింది.

మరి ఇప్పుడు గోపీచంద్ కెరియర్లో 30 వ చిత్రంగా డైరెక్టర్ శ్రీనివాస్ తో సినిమాని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా కూడా సక్సెస్ బాట పట్టించేందుకు ఈ చిత్రానికి సెంటిమెంట్ గా లక్ష్యం -2 అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి  గోపీచంద్ 30 వ సినిమాకి ఏ విధంగా సంబంధం లేకపోయినప్పటికీ.. హిట్ సెంటిమెంట్ తోనే  ఈ సినిమా టైటిల్ ని ఉంచే విధంగా మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని కంటెంట్ అద్భుతంగా ఉండి ఆకర్షణీయంగా ఉంటే చాలు సినిమా టైటిల్ ని ఇప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోరని చెప్పవచ్చు.

మరి టైటిల్ విషయంలో ఏ విధంగా సెంటిమెంటు కలిసొస్తుందో చూడాలి మరి. ఇకపోతే ఫ్యామిలీ ఎమోషన్ తో, చక్కటి సందేశాన్ని ఇస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుంది. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ను సరికొత్తగా చూపించబోతున్నారు అని చిత్రబృందం తెలియజేసింది. గోపీచంద్ సరసన డింపుల్ హయతి నటిస్తున్నది. ఇక వీరితో పాటుగా జగపతి బాబు, కుష్బూ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో సంగీతాన్ని మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా  ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: