తమిళ సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ను ప్రారంభించిన పూజాహెగ్డే తెలుగు లో ఫ్లాప్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె కెరియర్ మొదట్లోనే ఆగిపోతుంది అని అందరు అనుకున్నారు కానీ బాలీవుడ్ సినిమా పరిశ్రమ లోకి వెళ్లి అక్కడ సినిమాలు చేయడం ఆమెకు కలిసి వచ్చింది. ఈ క్రమంలో అక్కడ పలు సూపర్ హిట్ సినిమాలు చేసి రాణిస్తోన్న ఆమె ను మళ్లీ టాలీవుడ్ పిలిచి అవకాశాలు ఇచ్చి పెద్ద హీరోయిన్ ను చేసింది. అలా స్టార్ హీరోల అందరికీ కూడా ఆమె మొదటి ఛాయిస్ గా మారిపోయింది.

ఈమె తెలుగుతో పాటు తమిళ హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే ఈ మధ్యకాలంలో ఈమె తీరు చూస్తుంటే ఆమెకు ఇంతటి క్రేజ్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీ పై గౌరవం లేదా అని అనిపిస్తుంది. దక్షిణాది సినిమాలను ఆమె చిన్నచూపు చూస్తుందా అనే అనుమానాలను తీసుకువస్తుంది. సౌత్ సినిమా పరిశ్రమలో పూజా హెగ్డే చేతిలో ఉన్న సినిమాలు ఏ హీరోయిన్ కు లేవు. అయితే సినిమాలు చేయడం వరకు బాగానే ఉంది కానీ సదరు సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో ఈమె పెద్దగా కనిపించడం లేదు.

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో వరుస అవకాశాలు రావడమే దీనికి కారణం అని తెలుస్తోంది. అక్కడ సినిమా అవకాశాలు రావడంతో దక్షిణాది సినిమాలను తక్కువగా చూస్తోందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా తన పక్కన ఉన్న హీరోల కంటే ఎక్కువగా పూజ పాత్రనే ఎలివేట్ చేయమని కూడా పూజ హెగ్డే సదరు దర్శక నిర్మాతలకు సూచిస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అదేమీ పట్టించుకోని మన దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఆమె చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని బట్టి పూజా హెగ్డే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆమె చేతిలో సినిమాలు చూస్తుంటే ఇంకొన్నాళ్ళు ఇండస్ట్రీలో టాప్ కొనసాగేలా కనిపిస్తోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా ఆమెనే తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: