తనకు ఎవరి దగ్గర లౌక్యంగా ఉండడం తెలియదని తెలిపారు పృథ్వి. నాయకుడు తనకు వర్క్ ఇస్తే ఆ వరకు ఎంత సిన్సియర్గా చేసాను అనే ఆలోచన మాత్రమే తనకు ఉంటుందని కూడా తెలిపాడు. శత్రువుని కూడా బాగుండాలని కోరుకునే మనస్తత్వం తనది అని వెల్లడించాడు. ఇకపోతే సీఎం జగన్ రెడ్డిని కలిసి వివరించే పరిస్థితి లేదని ఆయన కామెంట్లు చేశారు అలాగే సీనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఎద్దుల బండ్లు కట్టుకొని మరి వెళ్లి చూసేవారని తెలిపాడు. ఇక మీడియా ఛానెల్స్ కు అలాగే మీకు కూడా ఒక కుటుంబం ఉన్నది మనసు పెట్టి ఆలోచించాలని తాను సూచించినట్లుగా పృధ్విరాజ్ వెల్లడించారు.
ఏదైనా రిపోర్టింగ్ చేసేవాళ్లను ఎప్పుడు కూడా తను తప్పు పట్టనని అయితే నిజం తెలుసుకొని రిపోర్ట్ చేయడం మంచిది అని.. ఎంత బాధ ఉంటే తను ఆ మాటలు మాట్లాడి ఉంటాను అర్థం చేసుకోమని కూడా తెలిపాడు. కానీ దేవుడికి చాలా దండం పెట్టుకున్నాను కానీ తన మీదే ఎందుకు ఇలా పడి ఏడుస్తున్నారు అలాగే జగన్ పై ఏవిధంగా పడుతున్నారో చూస్తూనే ఉన్నాము. వెనుక ఉంటూనే వెన్నుపోటు పొడుస్తున్నారు ఇది ఒక గేమ్ మాత్రమే అని పృద్వి వెల్లడించారు. ఇక ఈ మాటలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి