టాలీవుడ్
హీరోయిన్ రష్మిక మందన క్రేజ్ రోజు రోజుకు ఎలా పెరుగుతుంది అంటే ఆమె ఎవరో తెలియని సినీ అభిమాని ఉండడు అంటే నమ్మాల్సిందే. చిన్న
సినిమా పరిశ్రమ
కన్నడ చిత్రాల ద్వారా
హీరోయిన్ గా పరిచయం అయింది రష్మిక. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే తెలుగు
సినిమా పరిశ్రమలో అగ్ర
హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు బాలీవుడ్లో కూడా పలు ఆసక్తికర సినిమాలు చేస్తుంది రష్మిక. అంతే కాదు
బాలీవుడ్ లో కూడా పెద్ద హీరోలను ఆకర్షించే విధంగా ముందుకు వెళుతుంది.
ఈ విధంగా ఒక్కొక్క భాషలో పెద్ద పెద్ద హీరోలతో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ వారిని ఎంతగానో ఆకట్టుకునే విధంగా అందం అభినయాన్ని చూపించి ముందుకు వెళుతుంది. ఆ విధంగా తాజాగా తమిళనాట మరొక పెద్ద
హీరో సినిమాలో నటించడం
రష్మిక అభిమానులను ఎంతగానో సంతోషాలకు గురిచేస్తుంది.
విజయ్ దళపతి హీరోగా
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో
హీరోయిన్ గా
రష్మిక మందన నటిస్తుంది. ఈ
సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాగా ఈ కార్యక్రమానికి ఆమె హాజరైంది.
ఈ నేపథ్యంలో ఈ
సినిమా ప్రారంభోత్సవ వేడుకల్లో ఎంతో హడావిడి చేసిన
రష్మిక మందన గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అలా
రష్మిక స్థాయిలో ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతుంది. ఇక ఆమె నటిస్తున్న తెలుగు సినిమాల విషయానికి వస్తే పుష్ప రెండవ భాగం సినిమాలో
హీరోయిన్ గా నటిస్తున్నగా ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది ఈమె. అవి కూడా పెద్ద హీరోల సినిమాలు కావడం విశేషం. ఏదేమైనా ఒక నార్మల్
హీరోయిన్ గా తన కెరీర్ను ప్రారంభించిన
రష్మిక ఇప్పుడు ఈ స్థాయిలో ప్రేక్షకులను అలరించే సినిమాలు చేయడం విశేషం అని చెప్పాలి.