మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ సి 15'  సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. రామ్ చరణ్,  శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రామ్ చరణ్ కి కెరియర్ పరంగా 15 వ సినిమా. దానితో ఈ సినిమాను 'ఆర్ సి 15' అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ ను చేస్తున్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.  ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ 'ఆర్ ఆర్ ఆర్'  సినిమా విడుదల కాకముందు నుండే 'ఆర్ సి 15'  సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.  

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తిగా కూడా అయ్యింది. ప్రస్తుతం 'ఆర్ సి 15' సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.  వైజాగ్ షెడ్యూల్ లో ఒక యాక్షన్ సన్నివేశంతో పాటు,  కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.  ఈ మూవీ వైజాగ్ షెడ్యూల్ కు సంబంధించిన ఒక లీక్డ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే రామ్ చరణ్,  శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన పాటలలో రెండు పాటల చిత్రీకరణ పూర్తి అయినట్లు తెలుస్తోంది.  తాజాగా మూడో పాట చిత్రీకరణ కోసం శంకర్ భారీ ప్లాన్ వేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయంలోకి వెళితే...  'ఆర్ సి 15'  సినిమా సాంగ్  కోసం దర్శకుడు శంకర్ అదిరిపోయే ప్లాన్ చేశాడు అని,  ఈ సాంగ్ లో రామ్ చరణ్  స్టెప్ లు హైలెట్ గా ఉండబోతున్నాయి అని, ఈ సాంగ్ ని ఒక ప్రత్యేక సెట్ లో తెరకెక్కించబోతున్నారు అని,  జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ రూపుదిద్దుకుంటోంది అని,  ఈ సాంగ్ సినిమాకి హైలెట్ గా ఉండబోతుంది అని ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో అంజలి, సునీల్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: