స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా 100 కోట్ల మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడం గమనార్హం.

అసలు సినిమా సక్సెస్ అవుతుందా కాదా అని ఎన్నో అనుమానాలు కలుగుతున్నా ఆ సమయంలో పుష్ప మొదటి భాగం హిందీ లోనే భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడం గమనార్హం. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ విషయంలో కూడా చిత్ర యూనిట్ సభ్యుల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటున్నారట. వీలైనంత వరకు మేకింగ్ విషయంలో కూడా చాలా మార్పులు చేసే విధంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది.

అసలైతే పుష్పను కేవలం ఒకే భాగంలో విడుదల చేయాలని అనుకున్నారట. కానీ ఆ తర్వాత నిడివి ఎక్కువ కావడంతో సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే విధంగా దర్శకుడు ఆలోచించాడట. అయితే అప్పుడే పుష్ప 2 షూటింగ్ 80 శాతం పైగా పూర్తయిందని తెలుస్తుంది.ఇక మిగిలిన 20 శాతం కోసం దర్శకుడు వీలైనంత ఎక్కువ స్థాయిలో మేకింగ్ మార్చేందుకు చూస్తున్నాడని సమాచారం. అయితే ఈ సారి బాలీవుడ్ జనాలను కూడా ఎక్కువగా ఆకట్టుకునే విధంగా దర్శకుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.. ముఖ్యంగా బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ ను కూడా పుష్ప సెకండ్ పార్ట్ లో ముఖ్యమైన పాత్రలో చూపించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.ఇక ఫస్ట్ పార్ట్ లో నటించిన హీరోయిన్ రష్మిక మందన నటనకు మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ బ్యూటీకి సంబంధించిన రెండో భాగంలో కూడా రష్మిక మందన్నకు సంబంధించిన సన్నివేశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని తెలుస్తుంది. అయితే మరొక పవర్ఫుల్ పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోయిన్ కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆమె పాత్రను చివర్లో వచ్చే ఒక ట్విస్ట్ తో పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. తప్పకుండా సినిమాలో ఆ క్యారెక్టర్ హైలెట్ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం. అంతేకాకుండా మరికొంతమంది ప్రముఖ బాలీవుడ్ తారలను కూడా ఈ సినిమాలో భాగం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అయితే దర్శకుడు సుకుమార్ సెకండ్ పార్ట్ కు సంబంధించిన మరికొన్ని సన్నివేశాలను కూడా రీ షూట్ చేసే అవకాశం ఉన్నట్లుంది. సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ఫినిష్ చేసి వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నారట.. ఇక అల్లు అర్జున్ కూడా మరొక ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పుష్ప సెకండ్ పార్ట్ పూర్తయిన తర్వాతనే మరొక ప్రాజెక్టు పై ఫోకస్ చేయాలని అనుకుంటున్నాడని . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: