బాలీవుడ్ లో షారుక్ ఖాన్ ,అజయ్ దేవగన్ మధ్య విభేదాలు ఉన్నట్లుగా తరుచు అప్పుడప్పుడు కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇద్దరి మధ్య ఈగో కారణంగానే వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అన్నట్లుగా గతంలో వార్తలు వినిపించాయి. అయితే మరికొందరు మాత్రం కాజోల్ అగర్వాల్ కారణంగానే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదం ఉన్నట్లుగా కథనాలు వస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి విషయాలపై ఎప్పుడూ కూడా ఇద్దరు హీరోలు పబ్లిక్ గా స్పందించ లేదు. కానీ మీడియా కథనాలకు సైతం ఫుల్స్టాప్ పెట్టేందుకు ప్రయత్నాలు కూడా చేయలేదు ఈ ఇద్దరు హీరోలు.

దీంతో ఈ కథలు నిజమే అన్నంతగా బాగా పాపులర్ అయ్యాయి అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో అజయ్ దేవగన్ ఈ విషయానికి పుల్ స్టాప్ పెట్టేశారు. తనకి షారుక్ ఖాన్ కి మధ్య ఎలాంటి విభేదాలు లేవని షారుఖాన్, అమీర్ ఖాన్ అంతా ఒకేసారి పరిశ్రమకి వచ్చాము.. మేమంతా ఒక జనరేషన్ నటులను మా అందరి మధ్య ఎప్పుడూ కూడా సినిమా పోటీ అనేది ఉండనే ఉంటుంది అది ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది అని తెలిపారు. అంతకుమించి వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు అని తెలియజేశారు అజయ్ దేవగన్.

అయితే ఇలాంటి వార్తలపై పట్టించుకోవడం తనకు ఇష్టం లేదని కానీ వాటిని ఖండించక పోతే ప్రజలు నిజమే అనుకుంటారని అందుకే ఇప్పుడు ఇలా వివరణ ఇచ్చానని తెలియజేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ప్రచారానికి అజయ్ దేవగన్ తో శాశ్వత పరిష్కారం దొరికింది అని చెప్పవచ్చు. అయితే వీరితో పాటు మరొక వివాదం కూడా ఎన్నో రోజులుగా వినిపిస్తోంది. అదేమిటంటే షారుక్ అమీర్ ఖాన్ మధ్య కూడా గొడవలు ఉన్నాయని మీడియాలో వార్తలు బాగా అప్పుడప్పుడు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ విషయాలపై కూడా ఎవరూ స్పందించలేదు. మరి ఈ విషయంపై కూడా హీరోలు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: