ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే.  పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రాష్గ్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.  ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా,  దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన సంగీతం ఈ సినిమా విజయ స్థాయిని మరింతగా పెంచింది.  పుష్ప సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటల్లో కొన్ని మాటలు ఇప్పటికీ కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నయి.  

ఇది ఇలా ఉంటే పుష్ప సినిమా కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా దేశంలోని అనేక చోట్ల రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది.  పుష్ప పార్ట్ 1 మూవీ పాన్ ఇండియా రేంజర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో  ఎంతో మంది సినీ ప్రేమికులు పుష్ప పార్ట్ 2 సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే మొదటి 'పుష్ప పార్ట్ 1' లో అల్లు అర్జున్ సరసన శ్రీ వల్లి పాత్రలో నటించిన రష్మిక మందన తన అందచందాలతో , నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.  పుష్ప పార్ట్ 1 ఎండింగ్ లో రష్మిక తో అల్లు అర్జున్ కు పెళ్లి అవుతుంది.  

అక్కడితో పుష్ప పార్ట్ 1 సినిమా ముగిసిపోయింది.  అక్కడి నుండి పుష్ప పార్ట్ 2 సినిమా మొదలు కానుంది.  జూన్ నుండి పుష్ప పార్ట్ 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ ప్రారంభానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమాకు సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.  రష్మిక మందన తో పాటు మరో హీరోయిన్ కూడా పుష్ప పార్ట్ 2 లో ఉండబోతోందని తెలుస్తోంది. ఆ హీరోయిన్ తో కూడా అల్లు అర్జున్ రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: