అంతేకాదు ఆచార్య, కేజీఎఫ్2 సినిమాలను కూడా ఇంకా కొన్ని థియేటర్లలో ప్రదర్శిస్తుండటంతో ఈ సినిమాకు థియేటర్ల విషయంలో తీరని అన్యాయం జరుగుతోందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా అశోకవనంలో అర్జున కళ్యాణం ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ కాలేదు. అయితే థియేటర్ల సంఖ్య పెంచితే మాత్రం ఈ సినిమా తప్పకుండా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కచ్చితంగా ఉంటుంది. అంతేకాదు చిన్న చిన్న సినిమాలను బ్రతికించాలనే ఇదితో నిర్మాతలు ఈ సినిమాపై కాస్త దృష్టి పెడితే బాగుంటుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీకెండ్ లో ఎవరైనా ఈ సినిమాను చూడాలని భావిస్తున్నప్పటికీ తమకి దగ్గర్లోని థియేటర్ లో ఈ సినిమాను ప్రదర్శించక పోవటం చాలా బాధాకరం అని మరి కొందరు చెబుతున్నారు.
అంతేకాక ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న ఈ సినిమా ఇంత తక్కువ థియేటర్లతో ఫుల్ రన్ లో ఇక ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో వేచి చూడాలి. ఇది ఇలా ఉంటే మరోవైపు ఈ సినిమా యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చినా కూడా ఆ వార్తలను విశ్వక్ సేన్ ఖండించారు. అయితే ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో అలాగే ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంతేకాదు ఏపీలో ఇలాంటి చిన్న చిన్న సినిమాలకు ఒక షో కేటాయించాలననే నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనల విషయంలో చాలా కూడా కన్ఫ్యూజన్ ఉంది. మరి ఈ సినిమాకు ఎప్పటికి అన్ని థియేటర్ లలో స్థానం దక్కుతుందో లేదో చూడాలి.