తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం ఈయనకి ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు..తాజాగా మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రం విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు సైతం చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఇతర హీరో అభిమానులు మాత్రం ఈ సినిమా పై ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో కూడా మహేష్ బాబు ఒక విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మాస్ డైలాగులతో అభిమానులను సైతం ఆనందపరిచారు మహేష్ బాబు. దీనితో బాక్సాఫీస్ దగ్గర మరొకసారి రికార్డులను సైతం కొల్లగొట్టాడు అని చెప్పవచ్చు.


అడ్వాన్స్ బుకింగ్ లో నే కే జి ఎఫ్-2  రికార్డులను బద్దలు కొట్టిన సర్కారు వారి పాట చిత్రం తాజాగా ఫస్ట్ డే కలెక్షన్ ఫిగర్తో తన స్టామినా ఏంటో చూపించేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 75 కోట్లకు పైగా క్రాస్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. కొన్ని ఏరియాలలో మంచి కలెక్షన్లను రాబట్టి మహేష్ బాబు స్టామినా ఏంటో తెలిసేలా చేశారు. ఇక తాజాగా 75 కోట్ల రూపాయలు ఈ చిత్రం వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది.

ఇక రీజినల్ ఫిలిమ్ ఆల్ టైమ్ రికార్డు తోనే పోస్టర్ను కూడా ఫ్యాన్స్ కోసం విడుదల చేశారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టిస్తోంది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.. ఇందులో కీర్తి సురేష్ పాత్రకు తగ్గట్టుగా నటించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వెన్నెల కిషోర్, మహేష్ తన కామెడీతో మరొకసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: