టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇకపై థియేటర్ల లో రిపీటడ్ ఆడియన్స్ కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. 1000 కోట్ల కలెక్షన్లను దాటి సినిమాలు హంగామా చేస్తున్నాయి అన్నది చూసాం.. అయితే ఇది భారీ బడా చిత్రాలకు మాత్రమే అని లెక్కలు తెలుస్తున్నాయి. కాస్త చిన్న సినిమాలకు ఈ పరిస్థితి భిన్నంగా ఉంటోంది. పెరిగిన సినిమా టికెట్ల రేట్లే ఇందుకు కారణమని తెలుస్తోంది. గతంలో కంటే ఇపుడు టికెట్ల రెట్లు భారీగా పెరిగాయి. గతంలో తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్లలో 100, మల్టీప్లెక్సుల్లో 150 టికెట్ రేట్ ఉండగా... ఇప్పుడు ఆ రేట్లు రూ.150-175, రూ.295కు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ రేట్లే చాలా చాలా ఎక్కువ అన్నది ప్రేక్షకుల అభిప్రాయం అందుకే విజువల్‌గా చాలా స్పెషల్ గా ఉంది థియేటర్ల లలో తప్పితే ఆ ఫీల్ రాదు అన్న ఆర్ ఆర్ ఆర్ , కేజీ ఎఫ్ వంటి చిత్రాలకు మాత్రమే ఆడియన్స్ పరిమితం అవుతున్నారు.

లేదంటే ఈ రేంజ్ లో టికెట్ల కానీ ఫ్యామిలీ తో సినిమాలు చూడాలని ఎవరు అనుకోవడం లేదు. టికెట్టుకి అంత రేటు పెట్టడమే దండగా అనుకుంటుంటే దానికి తోడు ఇంట్రవల్ లో క్యాంటీన్ ఖర్చులు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఫ్యామిలీ లో ముగ్గురు, నలుగురు వెళ్ళారు అంటే ఇక టికెట్, క్యాంటీన్ ఖర్చులతో కలిపి దగ్గర దగ్గర 2,500 వరకు అవుతోంది. దాంతో ఇంత పెట్టీ సినిమాకు వెళ్ళడం అవసరమా అనుకుంటున్నారు ప్రేక్షకులు. అందులోనూ సినిమా రిలీజ్ అయిన నెల లోపే ఆ చిత్రాలు ఓ టి టి లోకి వచ్చేస్తుంటే ఇక అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారు. అందుకే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో ఉంటే తప్ప మామూలు చిత్రాల కోసం సగటు ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్ళడం లేదు.

ముఖ్యంగా సిని పరిశ్రమకు ముద్దుబిడ్డ అయిన సామాన్య మధ్యతరగతి ప్రేక్షకుడు కి అయితే ఈ రేట్లు అస్సలు అందుబాటులో లేకపోవడంతో ఆచార్య, సర్కారు వారి పాట వంటి స్టార్ హీరో చిత్రాలకు కూడా భిన్న ఫలితాలు వస్తున్నాయి అన్నది టాక్. ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదని, వీకెండ్స్ లో కూడా జోరు పెరగడం లేదు అంటున్నారు. మరి ఈ పరిస్థితులు మారి మునపటిలా టాలీవుడ్ థియేటర్లు ప్రేక్షక జనాలతో కళకళలాడాలి అంటే టికెట్ల రెట్లు తగ్గించక తప్పదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: