యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను పెంచుకున్న ఎన్టీఆర్ తాను నటించే తదుపరి సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించే విధంగా ప్రణాళికలు వేసుకున్నాడు. అందులో భాగంగా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు గా తెరకెక్కబోతున్నాయి.  

ఈ రెండు సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ లు కూడా తాజాగా బయటకు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక క్రేజీ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.  అసలు విషయం లోకి వెళితే... ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఒక సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఒక సినిమాకు కమిట్ అయిన విషయం మన అందరికి తెలిసిందే.  ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కే బోయే పాన్ ఇండియా సినిమాలే, అయితే ఈ రెండు సినిమాలలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.  

అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో కలిపి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.  ఇలా ఈ రెండు సినిమాలకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండడంతో ఎన్టీఆర్ ఈ రెండు సినిమాలకు కూడా ఒక రూపాయి కూడా రెమ్యూనరేషన్ ను తీసుకోవట్లేదు అని ,  సినిమా మొత్తం పూర్తి అయ్యాక ఆ సినిమాకు వచ్చే లాభాలను బట్టి ఎన్టీఆర్ అందులో షేర్ తీసుకోనున్నట్లు,  అలాగే కొన్నాళ్లుగా కళ్యాణ్ రామ్ కి కూడా సరైన విజయాలు లేకపోవడంతో ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: