దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ గా వెంకటేష్ హీరోగా వరుణ్ తేజ్ మరో హీరోగా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం F-3 ఇందులో హీరోయిన్ గా తమన్నా, మెహ్రిన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమా నుంచి కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా ఉండబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నటీనటులు సినిమా ప్రమోషన్ ఈ విషయంలో కూడా బాగా పాపులర్ అయ్యారు.. ఇక నిన్నటి రోజున హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ఈ చిత్రం ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు నవ్వు ఎంత ముఖ్యం అనేది ఈ F-3 సినిమా తెలియజేస్తుంది అని తెలియజేశాడు.


తెలుగు రాష్ట్రాల ప్రజలకు కావాల్సినంత నవ్వులను పంచే చిత్రం ఇది. F-3 చిత్రాన్ని డైరెక్టర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని అనిల్ రావిపూడి ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఒకవేళ ఈ చిత్రం హిట్ కాకపోతే గుండెల మీద చెయ్యి వేసుకుని చెబుతున్నాను మళ్ళీ ముందు నేను ఎప్పుడూ నిలబడని తెలియజేశాడు. ఈ చిత్రంలోని ప్రతి ఒక్క పాత్ర కూడా 100% ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది అని తెలియజేశారు. F-3 చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి సూపర్హిట్ చేయాలని తన కోరుకుంటున్నట్లుగా తెలియజేశాడు నటుడు రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం ఈయన చేసిన వాక్యాలు ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: