హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది అంటే ప్రేక్షకులలో ఆ సినిమాపై తారా స్థాయిలో అంచనాలుంటాయి. టాలీవుడ్‌లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు చాలానే ఉన్నాయి.అయితే అలా తెరకెక్కిన సీక్వెల్ సినిమాలు విజయాలు సాధించినవి చాలా తక్కువ సినిమాలు అని చెప్పాలి. ఈ క్రమంలో ఒరిజినల్ కంటే సీక్వెల్ మరింత పెద్ద విజయం సాధిస్తుందని 'ఎఫ్‌-3' బృందం గట్టి నమ్మకంతో ఉన్నారట. సంక్రాంతి పండుగ కానుకగా 2019లో వచ్చిన 'ఎఫ్‌-2' ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. మూడేళ్ళ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కింది. ఈ సారి డబుల్ ఎంటర్టైనమెంట్‌తో ఎఫ్‌3 సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపింది.వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను ఎంతో విపరీతంగా ఆకట్టుకున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 27 వ తేదీ న విడుదల కానుంది.ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను కూడా ప్రారంభించింది. ఈ ప్రమోషన్లలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా అనీల్ రావిపూడి ఎఫ్‌-3 సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, ఈ సినిమా ఒక చార్లీ చాప్లిన్ తరహా విజువల్ ఫన్ అని తెలిపాడు.ఇక శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఇంకా అలాగే శిరీష్‌లు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో తమన్నా ఇంకా మెహరిన్‌లు కథానాయికలుగా నటించారు. సునీల్ ఇంకా సోనాల్‌చౌహన్‌లు కీలకపాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా హెగ్టే ఓ స్పెషల్ సాంగ్‌లో పెర్ఫార్మ్ చేసింది. నిజానికి ఈ సినిమా గతంలోనే విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఇటీవలే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక కూడా చాలా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

F3