సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అదిరిపోయే ఫామ్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితం బ్రహ్మోత్సవం , స్పైడర్ వంటి వరుస పరాజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న మహేష్ బాబు  తర్వాత భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరు మూవీ లతో వరుస పెట్టి బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. 

అలా హైట్రిక్ విజయా లతో ఫుల్ ఫామ్ లో ఉన్న మహేష్ బాబు తాజాగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ లో హీరోగా నటించాడు. ఎన్నో అంచనాల నడుమ మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదలైన సర్కారు వారి పాట సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకొని ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.  ఇలా వరుసగా నాలుగు విజయా లను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఆ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో మహేష్ బాబు నటించబోతున్నాడు. 

ఇది ఇలా ఉంటే తాజాగా కోలీవుడ్ క్రేజీ దర్శకుడు లోకేష్ కనకరాజు , సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఒక కథను వినిపించినట్లు,  ఆ కథ మహేష్ బాబు కు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే లోకేష్ కనకరాజు తాజాగా విక్రమ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూన్ 3 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు , తళపతి విజయ్ హీరోగా నటించబోయే మూవీ కి దర్శకత్వం వహించబోతున్నట్లు  తాజాగా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: