జై భీమ్.. తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్. ఈ సినిమా ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత ఆస్కార్ బరిలో నిలిచింది ఈ సినిమా. ఇక ఈ సినిమా సూర్య అభిమానులను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కూడా ఎంతగానో మెప్పించింది. ఇకపోతే గిరిజనులకు అండగా నిలిచిన లాయర్ చంద్రు కథే ఈ జై భీమ్ సినిమా. ఇక ఈ సినిమాలో చంద్రు పాత్రలో సూర్య నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక సూర్య నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక డీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో జై భీమ్ సినిమా రూపొందించడం జరిగింది. ఇక పోలీసులు,  కోర్టులు,  కేసులు అంటూ సాగే కథ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందుకే విమర్శకులు సైతం ఈ సినిమాను మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సూర్య  నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు అని చెప్పవచ్చు.
సూర్య అలాగే దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో మళ్లీ ఈ కాంబో రిపీట్ కానున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసింది ఇక ఇటీవలే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఈయన బాల దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. శివ పుత్రుడు సినిమా తర్వాత సూర్య మరొకసారి బాలా దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

ఇక అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా వాడి వాసల్ అనే సినిమాను కూడా సూర్య తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమాలన్నీ పూర్తయిన వెంటనే సూర్య కోసం జ్ఞానవేల్ ఒక కథను సిద్ధం చేశారు అని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సూర్య కోసమే ప్రత్యేకంగా రూపొందించిన కథ సూర్యకు నచ్చడంతో పాటు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: