అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఏజెంట్' కోసం అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక వారి అంచనాలు మరింత పెంచేస్తూ ఈ సినిమా కోసం అఖిల్ మేకోవర్ ఇంకా అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకలు ఎంతో ఆతృతగా ఉన్నారు.ఇక పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి అత్యంత స్టైలిష్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, ఈ సినిమాలో హీరో అఖిల్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు చెప్పడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని సినీ వర్గాలు బాగా ఎదురుచూస్తున్నాయి.అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌ను కూడా లాక్ చేసుకుంది.ఇక ఈ ఏజెంట్ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.అలాగే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం అనేది తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు పూర్తి కథను ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించగా, ఈ సినిమాలో మలయాళ స్టార యాక్టర్ మమ్ముట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇంకా సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాను ఆగస్టు 12 వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: