అందాల ముద్దుగుమ్మ మెహరిన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ జోష్ లో తన కెరియర్ ను ముందుకు తీసుకు వెళుతుంది. కొన్ని రోజుల క్రితమే మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన మంచిరోజులు వచ్చాయి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెహరిన్ రేపు అనగా మే 27 వ తేదీన విడుదల కాబోయే ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది.

ఇలా ఎఫ్ ఏ సినిమా విడుదల కాకముందే మెహరీన్ కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అయిన తలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.  ఇది ఇలా ఉంటే మరో క్రేజీ సినిమాలో మెహరీన్ అవకాశాన్ని దక్కించుకున్నట్లు ప్రస్తుతం ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే...  అనిల్ రావిపూడి, బాలకృష్ణ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా మెహరీన్ ను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నట్టు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇప్పటికే మెహరీన్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్, ఎఫ్ 2 , ఎఫ్ 3  మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.  అలాగే అనిల్ రావిపూడి తదుపరి దర్శకత్వం వహించబోయే బాలకృష్ణ సినిమాలో కూడా మెహరీన్ నే హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి, బాలకృష్ణ తో తెరకెక్కించబోయే సినిమాను తన స్టైల్ లో కామెడీ ప్రధానంగా ఉండేలా కాకుండా బాలకృష్ణ స్టైల్ లో అదిరిపోయే యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు కొన్ని సందర్భాల్లో తెలియజేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: