నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరైన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 3 సినిమా రేపు అనగా మే 27 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.

సినిమా పనులు అన్ని ముగిసిన తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి , బాలకృష్ణ సినిమా పై పూర్తిగా పని చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనేక సందర్భాలలో బాలకృష్ణ తో తను తెరకెక్కించబోయే  సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.  ఒకానొక సందర్భంలో దర్శకుడు అనిల్ రావిపూడి, బాలకృష్ణతో తాను తీయబోయే సినిమా తన స్టైల్లో ఉండదు అని , బాలకృష్ణ స్టైల్ లో ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని తెలియజేశాడు.

ఇది ఇలా ఉంటే బాలకృష్ణ సినిమాలో మెహరిన్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఇలా ఈ వార్తలు బయటకు వచ్చి ఎక్కువ కాలం కాకముందే ఈ సినిమాలో హీరోయిన్ గా మరొక ముద్దుగుమ్మ పేరు తెరపైకి వచ్చింది. అసలు విషయం లోకి వెళితే... బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో  దర్శకుడు అనిల్ రావిపూడి ప్రియమణి ని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.  ప్రియమణి కూడా ఇదివరకు బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన మిత్రుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి జంట కు ప్రేక్షకుల నుండి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఆ కారణం తోనే అనిల్ రావిపూడి మరొక సారి ప్రియమణి ని బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: