ఈ బుట్టబొమ్మ.. ఏ డ్రస్సు వేసినా అందమేనమ్మా. పూజా హెగ్దేకి మాత్రం మంచి డ్రస్సింగ్ సెన్స్ వుంది. అందులోనూ ఫోటో సెషన్స్ కోసం పూజా హెగ్దే తీసుకునే జాగ్రత్త లు కూడా కెవ్వు కేక.


స్టైలింగ్‌తో పాటు, ఆటిట్యూడ్ కూడా అచ్చు గుద్దినట్లు కనిపించేలా జాగ్రత్త పడుతుంటుంద ట తన ఫోటోల్లో పూజా హెగ్దే.తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ బర్త్‌డే వేడుకలకు హాజరైందట పూజా హెగ్దే. గోల్డెన్ కలర్ పొట్టి డ్రస్సులో దర్శనమిచ్చి కేక పుట్టించింది. అక్కడి వెలుగుల జిలుగుల్లో బంగారు గౌనులో పూజా హెగ్దే మరింతలా ధగధగ మెరిసిపోయింది. 'నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..' అంటూ పాటందుకోవడమే ఆలస్యమట 


హై హీల్ ధరించి, అదిరిపోయే స్టిల్స్‌లో ఫోటోలకు పోజిచ్చింది. అసలే బుట్ట బొమ్మ కదా.. క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రోళ్ల మతులు పోగొట్టేలా వున్నాయ్ ఆ మరి ఆ పిక్స్. పూజా హెగ్దేకి ఇలాంటి ఫోటో సెషన్స్ అస్సలు కొత్తేం కాకపోయినా, ఈ వేడుకలో ఆమె సమ్‌థింగ్ డిఫరెంట్ ఎట్రాక్షన్‌తో కనిపించిందట 


ఇక, పూజా చేతిలో బోలెడన్ని ప్రాజెక్టులున్న విషయం తెలిసిందే. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ పూజా హెగ్దే మూడు ఫ్లాపులిచ్చినా సరే, 'నెంబర్ వన్ ఛైర్ మాత్రం నాదే. నేనెవ్వరికీ ఇయ్య..' అన్నట్లుగా తిష్ట వేసుకుని కూర్చొందట .పవన్ కళ్యాణ్‌తో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలో పూజా హెగ్దే నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ కూడా పూజా చేస్తుంది.టాలీవుడ్ లో పూజా హెగ్డే కు మంచి క్రేజ్ అయితే వుంది. ఈ క్రేజ్ నే కాష్ చేసుకుంటుంది. ఈ అమ్మడు. యాక్టింగ్ పాత్రలు చేయకపోయినా గ్లామర్ తో నెట్టుకొని వస్తుంది. గుర్తుండిపోయే పాత్రలు ఇంతవరకు చేయలేదు పూజా హెగ్డే.

మరింత సమాచారం తెలుసుకోండి: