2008లో, VN ఆదిత్య డైరెక్టోరియల్ లో వచ్చిన "రెయిన్బో" సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాల్ చౌహన్. ఆ తరవాత డజనుకు పైగా తెలుగు చిత్రాల్లోనే నటించింది.


ఆ సినిమాలేవీ సోనాల్ కు అస్సలు గుర్తింపును తీసుకురాలేదు కానీ, ఆయా సినిమాలలో సోనాల్ బికినీ షోలు మాత్రం ఆమెకు మంచి గుర్తింపును అయితే తీసుకొచ్చాయి. నటసింహం బాలయ్య బాబుతో సోనాల్ నటించిన లెజెండ్, డిక్టేటర్, రూలర్, రామ్ పోతినేనితో చేసిన పండగ చేస్కో సినిమాలలో సోనాల్ నటనకు పెద్దగా గుర్తింపు రాకపోయినా కానీ ఆమె బికినీ సీన్ల ద్వారా యూత్ లో మంచి క్రేజు ను సంపాదించుకుంది.


తాజాగా సోనాల్ నటించిన తెలుగు సినిమా ఎఫ్ 3. ఇందులో ఒక కీలక పాత్రలో నటించిన సోనాల్, ఈసారి బికినీ కి దూరంగా ఉందట.. అయినా కానీ బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు ప్రధానపాత్రల్లో నటించిన ఎఫ్ 3 లో సోనాల్ ఒక స్పెషల్ రోల్ లో ఆమె నటించి అలరించింది. నిన్న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. ఇందులో సోనాల్ పాత్రను అనిల్ రావిపూడి తీర్చిదిద్దిన విధానం, సోనాల్ యాక్టింగ్ బాగా సింక్ అయ్యాయి. దీంతో ఇన్ని సినిమాలలో నటించినా రాని బ్లాక్ బస్టర్ హిట్ అనుకోకుండా చేసిన ఎఫ్ 3 సినిమాతో దక్కిందని, అది కూడా ఎలాంటి బికినీ సీన్స్ లేకుండానే అని సోనాల్ తెగ సంతోష పడిపోతుందనీ తెలుస్తుంది.


ప్రస్తుతం సోనాల్ రెండు టాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తుందట. ఒకటి ప్రభాస్ "ఆదిపురుష్", రెండు నాగార్జున "ఘోస్ట్". ఘోస్ట్ లో నాగార్జున సరసన రొమాన్స్ చేస్తుంటే, ఆదిపురుష్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో సోనాల్ నటిస్తుందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: