రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత సౌత్ సినీ ఇండస్ట్రీలో భారీ సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం 'కే జి ఎఫ్ చాప్టర్ 2'. కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా మొత్తం ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అంతే కాదు కేవలం ఈ ఒక్క సినిమాతోనే హీరో యశ్ కెరియర్ పూర్తిగా మారిపోయింది. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల మార్కను అధిగమించి  సరికొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసింది.

అక్కడ కలెక్షన్స్ లో అగ్రహీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి రాఖీ భాయ్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఇక ఈ సినిమాలో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాని మరో లెవల్కి తీసుకెళ్లాయనే చెప్పాలి. రవి బసృర్ ఈ సినిమాకి అందించిన సంగీతం సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మరో సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆన్ లైన్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో భారీ రికార్డు నమోదు చేసింది. ఈ సినిమాకి మొత్తం ఇండియన్ వైడ్ ఒక బుక్మైషో లో ఏకంగా 17 మిలియన్స్ కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది మన ఇండియన్ సినిమా దగ్గర అయితే ఒక భారీ రికార్డు అని చెప్పవచ్చు.

ఈ రికార్డుతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఓటీటీ లో కూడా దూసుకుపోతున్న ఈ సినిమాలో యశ్ కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, రావురమేష్, రవీనాటాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హోంబాలే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరందుర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక త్వరలోనే కేజిఎఫ్ పార్ట్ 3  కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుండగా..మరి పార్ట్3 లో యశ్ నటిస్తున్నాడా లేదంటే మరో హీరోతో తెరకెక్కిస్తారా అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: