హిట్ అయిన చిత్రాన్ని బాగోలేదని ప్రచారం చేస్తున్నారు ఇలా చేయడం చాలా సరైనది కాదని కమెడియన్ ఆలీ సినిమా ని నమ్ముకున్న వారే ఇలా ప్రచారం చేయడం బాగలేదని కామెంట్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన సినిమా f-3 సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. ఇందులో కమెడియన్ ఆలీ కూడా కొన్ని తీవ్రమైన వార్తలు చేశారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి హీరోలుగా నటించారు. ఈ సినిమా మే 27న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఇందులో తమన్నా,  మెహరీన్ హీరోయిన్ లుగా నటించగా సోనాల్ చౌహాన్ మాత్రం కీలకమైన పాత్రలో నటించింది. విడుదలైన మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని .. వేడుక నూ హైదరాబాద్ లో కూడా చాలా ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా కమెడియన్ అలీ మాట్లాడుతూ.. అద్భుతమైన హిట్ ఇచ్చిన ఈ ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.


ఈ రోజు నిజమైన పండుగ రోజు సోమవారం కూడా హౌస్ఫుల్ తో ఈ సినిమా దూసుకుపోతోంది.. ఈ బ్యానర్ కు ఉన్న విలువ దర్శకుడు అనిల్ రావిపూడి హీరోలైన వెంకటేశ్, వరుణ్ తేజ్ పైన ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా ఇంత హిట్ అయిందని తెలియజేశాడు. చాలామంది ఫోన్లు చేసి రెండు మూడు సార్లు చూశామన్నారు సినిమా హిట్ అయితే అందరూ బాగుంటారు.. కొంతమంది హిట్ అయినా కూడా సినిమాను బాగా లేదని ప్రచారం చేస్తున్నారు ఇలా చేయడం అస్సలు సరైనది కాదు.. ఇలా చేయకండి అంటూ తెలియజేశారు. మీరు కూడా సినిమానే నమ్ముకున్నారు కదా గతంలో చెన్నై లో ఉండగా ఇలాంటి వార్తలు వినిపించేవి కాదు..ఒకరి సినిమా హిట్ అయితే మరొకరు బాధపడడం ఏమిటో తనకు ఇంకా అర్థం కాలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: