బుల్లి తెర సుందరి, యాంకర్ రేష్మీ గౌతమ్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. సినిమాల నుంచి వచ్చిన ఈ అమ్మడు యాంకర్ గా మంచి మార్కులు వేయించుకుంది.జబర్దస్త్ షో ద్వారా అందరి మనసులను గెలుచుకుంది.ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం యూత్ లో మంచి ఫాలొయింగ్ వుంది.సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బుల్లితెరను ఏలుతోంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు, ఈటీవీలో ప్రసారమయ్యే పలు ఈవెంట్లలోనూ పాల్గొంటూ అందరినీ ఆకట్టుకుంటుంది.


ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది. అదే విధంగా లేటెస్ట్ ఫొటోషూట్లతోనూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంటుంది. మరోవైపు జంతు ప్రేమికురాలు అయిన రష్మీ.. కుక్కలు, ఆవులు, గేదెలు, కోళ్లు ఇలా ఏ ఒక్క జీవిని మనుషులు బాధ పెట్టినా కూడా రష్మీ ఆవేదనను వ్యక్తం చేస్తుంది.పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు అంటూ జంతువులను బలి ఇవ్వడం, మాంసాహారం తినడం వంటి వాటిని వ్యతిరేకిస్తుంటుంది. ఇక పాలు, పాల పదార్థాలు తినడం కూడా యాంకర్ రష్మీకి ఇష్టముండదు.వాటిని అనేక రకాలుగా హింసించి పాలు తీస్తారు అంటుంది.


ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో పోస్ట్ చేసింది.అందులో ఆవును, గేదెను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూపించింది. ఇండియాలో ఉన్న దరిద్రం ఇదే.. మనం ఒక వైపు గోమాత అని పిలుస్తుంటాం.. ఇంకో వైపు వాటి చర్మాలతో తయారు చేసిన లెదర్ వస్తువులను వాడుతుంటాం.. జీవులను హింస పెట్టకుండా తయారయ్యే వస్తువులను మాత్రమే వాడండి అంటూ రష్మీ తన ఆవేదనను వ్యక్తం చేసింది.మీరు రోజూ తాగే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కాస్త తెలుసుకోండంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. మొత్తానికి రష్మీ మాత్రం తన సామాజిక స్పృహను ఇలా పదే పదే చాటుకుంటూ ఉంటుంది. అయితే కొందరు రష్మీకి తమ వంతు మద్దతు ప్రకటిస్తున్నా, మరి కొందరు మాత్రం నువ్వు చెప్పేవి వినడానికి బాగుంటాయి కాని అమలు చేయడానికి బాగుండవు అని పేర్కొన్నారు..మొత్తానికి ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: