రవితేజ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. వీటిలో ముందుగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబో తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పలు అప్డేట్లు సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెంచాయి. రవితేజ నటించిన గత చిత్రం ప్రేక్షకులను నిరాశ పరచడంతో ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రవితేజ కూడా ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉండడం అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది.

ఇక ఈ సినిమా తర్వాత ఆయన వరుస యాక్షన్ భరితమైన సినిమాలు చేస్తూ ఉండటం ఆయన అభిమానులలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసాన్ని పెంచు తుంది. అంతకుముందు ఆయన ఒక్కొక్క సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగా ఇప్పుడు ఒకేసారి నాలుగైదు సినిమాలు సెట్స్ మీద ఉంచడం అభిమానులను సంతోష పెడుతుంది. ఆ విధంగా మంచి రెమ్యునరేషన్ ఇచ్చి మళ్లీ రవితేజతో సినిమాలు చేయాలని భావిస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు. 

వాస్తవానికి రవితేజకు ఇప్పుడు ఆయన చేసే సినిమాల బడ్జెట్ లో సగం మాత్రమే మార్కెట్ ఉంది. హిట్ అయితే తప్ప ఆయన సినిమాల యొక్క కలెక్షన్లు బడ్జెట్ మొత్తం దాటిపోవు. ఆ విధంగా నిర్మాతలు ఏవిధంగా ధైర్యం చేసి ఆయనతో భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారో తెలియదు కానీ ఇంత మంది నిర్మాతలు ఆయనతో సినిమా చేయాలనుకోవడం విశేషం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి ఇంతటి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరో ఈ స్థాయి స్టార్ హీరో ఎదగడానికి చాలా సమయమే పట్టింది. ఈ నేపథ్యంలో 20 కోట్ల పారితోషికం తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు అంటే రవితేజకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.ఈ సమయంలో ఈ రేంజ్ లో అందుకోవడం అంటే నిజంగా గొప్పే అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: