దర్శకుడు వంశీ పైడిపల్లి మహర్షి సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో చేసిన తర్వాత ఆయన ఏ సినిమా చేస్తాడో అన్న ఆత్రుత కూడా అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన తమిళనాట స్టార్ హీరోగా ఉన్న విజయ్ దళపతి తో సినిమా చేయడం అభిమానులను ఎంతగానో సంతోష పెట్టింది. వీరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్ దళపతి ఏకంగా వంద కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు అనే వార్తలు వచ్చాయి.

ఈరోజు విజయ్ దళపతి పుట్టినరోజు కావడంతో ఈ సినిమా యొక్క టైటిల్ ను పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. వారిసు అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టారు. తెలుగులో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఇంకా నిర్ధారించలేదు. ఇదే టైటిల్ తో తెలుగులోనూ తెరకెక్కిస్తారా లేదా మరేదైనా టైటిల్ ను అనుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రంపై తెలుగు తమిళ ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఇందులో విజయ్ దళపతి స్టైల్ కంటే ఎక్కువగా వంశీ పైడిపల్లి స్టైల్ కనిపిస్తుందని చెపుతున్నారు కొంతమంది సినిమా విశ్లేషకులు. క్లాస్ టేకింగ్ తో మాస్ ప్రేక్షకులను అలరించిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాలోనూ అలాంటి స్టైల్ కణపరిచి అందరినీ ఫిదా చేస్తాడని అంటున్నారు. మరి వీరి కాంబినేషన్లో రాబోతున్న తొలి సినిమా కావడంతో చిత్రబృందం ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తుది. ఇంకొక వైపు విజయ్ దళపతి కి గత సినిమా డిజాస్టర్ ను అందించడంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: