కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తలపతి విజయ్ కొన్ని రోజుల క్రితమే బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. బీస్ట్ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన బీస్ట్ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను కూడా అందుకోలేకపోయింది. 

ఇలా బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన తలపతి విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరైన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరిసు (వారసుడు) మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ షూటింగ్ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ లో కొంత కాలం క్రితమే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. కాకపోతే చిత్ర బృందం విడుదల చేసిన తలపతి విజయ్ ఫస్ట్ పోస్టర్ పై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. వంశీ పైడిపల్లి గతంలో దర్శకత్వం వహించిన మహర్షి సినిమాలో మహేష్ బాబు లుక్ ని పోయినట్టే వరిసు (వారసుడు) సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉండడంతో నెటిజన్లు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పై చాలా ట్రోల్స్ చేశారు.

అయితే నిన్న అనగా తలపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా వరిసు (వారసుడు) చిత్ర బృందం ఏకంగా సెకండ్ లుక్ పోస్టర్ మరియు థర్డ్ లుక్ పోస్టర్ లను విడుదల చేశారు. సెకండ్ లుక్ పోస్టర్ లో తలపతి విజయ్ చిన్న పిల్లలతో  ఉండగా,  థర్డ్ లుక్ పోస్టర్ లో తలపతి విజయ్ బైక్ పై స్టైల్ గా కూర్చొని ఉన్న ఫోటోను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం వరిసు (వారసుడు) సినిమాలోని తలపతి విజయ్ కి సంబంధించిన థర్డ్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: