అక్కినేని నాగచైతన్య ఇప్పటివరకు తెలుగులో మరో హీరో సాధించని ఘనతను సాధించినట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే తమిళ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఏ ఆర్ రెహమాన్ తో రెండు సినిమాలకు పని చేసిన ఏకైక తెలుగు హీరోగా నాగచైతన్యకు మాత్రమే ఆస్థానం దక్కింది. తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో చైతు చేసిన ఏం మాయ చేశావే, సాహసం శ్వాసగా సాగిపో అ రెండు సినిమాలకు రెహమాన్ సంగీతాన్ని అందించారు. తెలుగులో రెహమాన్ చేసిన సినిమాలు చాలా తక్కువగానే ఉన్నాయి. బాలకృష్ణ తో నిప్పురవ్వ, పవన్తో కొమరం పులి, నాగార్జున రక్షకుడు, వెంకటేష్ సూపర్ పోలీస్ వంటి సినిమాలను మాత్రమే చేశారు.

కేవలం వీరందరితో ఒక్కొక్క సినిమాలే చేశారు. కానీ నాగచైతన్య తో మాత్రం రెండు సినిమాలకు పని చేశారు. ఇప్పుడు చైతన్య తో ఇంకో అరుదైన ఘనతను సాధించారు. లెజెండరీ డైరెక్టర్ ఇళయరాజా తో కూడా అతను జతకట్టబోతున్నట్లు గా తెలుస్తోంది. ఈయనతో ఎక్కువగా బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మాత్రమే ఆల్ టైం రికార్డు గా పని చేశారు ఇప్పుడు చైతన్య కూడా ఆ అరుదైన జాబితానే చేరబోతున్నట్టు సమాచారం. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభుత్వం చైతన్య ఒక సినిమాలో నటించబోతున్నారు.


దీని గురించి ఇదివరకే అధికారికంగా ప్రకటన వెలువడింది ఇది చైతన్య కెరియర్ లో 22వ సినిమాసినిమా నుంచి తాజాగా రెండు ఆసక్తికరమైన అప్డేట్ బయటకు రావడం జరిగింది. ఈ సినిమాకి ఇళయరాజా తో పాటు ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చోబోతున్నారు. కానీ వెంకట్ ప్రభు తన ప్రతి సినిమాకి తన సోదరుడు యువన్ తోనే సంగీతాన్ని అందించేవారు. కానీ మొదటిసారి తన పెదనాన్న ఇళయరాజా తో కలిసి పని చేయబోతున్నారు. చైతన్య మొదటిసారి ఇళయరాజా ఆయన తనయుడు యువ లతో సినిమా చేయబోతుండటం గమనార్హం ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టి ఎంపికైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: