టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు అయిన గోపీచంద్ గత కొద్ది కాలంగా వరుస అపజయాలతో బాక్సాఫీస్ దగ్గర డీలపడిపోయి ఉన్న సమయంలో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సిటీ మర్ మూవీ తో గోపీచంద్ బాక్సాఫీస్ దగ్గర మంచి అందుకొని ఫామ్ లోకి వచ్చాడు. 

సీటీ మార్ మూవీ లో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించింది. సిటీ మర్ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా,  ఈ మూవీ లో రావు రమేష్ , సత్య రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జులై 1 వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే పక్కా కమర్షియల్ చిత్ర బృందం లోని సభ్యులు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో , సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

అందులో భాగంగా పక్కా కమర్షియల్ చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ను విడుదల చేసింది. పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 26 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రై రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించి చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: