నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ బిజీ గా ఉన్స్ విషయం మన అందరికీ తెలిసిందే. వరుస మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్న సమయం లోనే బాలకృష్ణ ప్రముఖ సంస్థలలో ఒకటి అయిన ఆహా 'ఓ టి టి' లో ఆన్ స్థాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే.  

బాలకృష్ణ మొట్ట మొదటి సారి ఒక షో కు హోస్ట్ గా వ్యవహరించడంతో ఈ  షో పై బాలకృష్ణ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తి చూపించారు. అయితే ఈ టాక్ షో లో భాగంగా బాలకృష్ణ ఎంతో మంది గెస్టు లతో అనేక విషయాలను ముచ్చటించి నవ్వులు పూయించాడు.  అలాగే బాలకృష్ణ తన మేనరిజమ్స్ తో,  డైలాగ్స్ తో ,  కామెడీ పంచ్ లతో ఆద్యంతం షో ను రక్తి కట్టించి సూపర్ సక్సెస్ చేశాడు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ 'ఆన్ స్థాపబుల్' ఫస్ట్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించినందుకు కేవలం కోటి రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో రెండవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. కాకపోతే మొదటి సీజన్ తో పోలిస్తే రెండవ సీజన్ కి బాలకృష్ణ కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఎపిసోడ్ కు 25 లక్షల చొప్పున మొత్తంగా 12 ఎపిసోడ్ లకు కలిపి 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ రేంజ్ కి ఇది తక్కువ రెమ్యూనరేషనే అయినప్పటికీ ఆహా 'ఓ టి టి' సబ్స్టేషన్ ఛార్జీలు తక్కువ ధర ఉండటంతో బాలకృష్ణ కూడా ఓకే చెప్పినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: