నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ మూవీ తో బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే  . అఖండ సినిమాతో బాలకృష్ణ 100 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల కొట్టి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు .

అలా అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలకృష్ణ , ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కావడం , క్రాక్ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి . ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా , దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు .  శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతోంది . ఈ సినిమా తర్వాత బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు .

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరు అయిన రాజశేఖర్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి . అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ లో రాజశేఖర్ ప్రతినాయకుడి పాత్రలో నటించబోతున్నారు అనే వార్త పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది . ఈ సినిమా షూటింగ్ ను మరి కొన్ని రోజుల్లో చిత్ర బృందం ప్రారంభించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: