తెలుగు ఎనెర్జిటిక్ హీరో రామ్ పోతినెని గురించీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..దేవదాసు సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ హీరో ఆ తర్వాత ఒక్కో సినిమా తో ఒక్కో రేంజ్ టాక్ ను అందుకుంటూ వరుస సినిమాలతో దూసుకు పోతున్నారు.. ప్రస్తుతం హీరో మంచి దూకుడు మీద ఉన్నాడు.ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ స్పీడుమీదున్నాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో 'ది వారియర్' అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు ఈ హీరో.


ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ మూవీని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుతో స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ లాంఛ్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తయ్యే ఛాన్సులు ఉన్నాయి..నెక్స్ట్ రామ్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం ఆసక్తి కలిగిస్తుంది.గతంలో తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, రామ్ పోతినేనికి ఓ కథను వినిపించాడట. అయితే ఈ సినిమాపై తన నిర్ణయాన్ని మాత్రం రామ్ వెల్లడించలేదు. దీంతో ఇప్పుడు మరోసారి ఈ ప్రాజెక్ట్ వార్తల్లో నిలిచింది. ఇటీవల మరోసారి రామ్‌ను కలిసిన గౌతమ్, ఈసారి ఓ రొమాంటిక్ సబ్జెక్టును వినిపించాడట. ఈ కథ రామ్‌కు బాగా నచ్చినట్లుగా తెలుస్తోంది.


రామ్ ఈ సినిమాకు ఓకే చెప్పాడని.. వచ్చే ఏడాది సమ్మర్ తరువాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రామ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే రామ్ వరుసగా తమిళ దర్శకులకే ప్రాధాన్యతను ఇస్తుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. లింగుస్వామితో సినిమాను రిలీజ్‌కు రెడీ చేసిన రామ్, ఇప్పుడు గౌతమ్ మీనన్‌తో సినిమా కమిట్ కావడం ఏమిటని సినీ క్రిటిక్స్ ప్రశ్నిస్తున్నారు. తెలుగులో ట్యాలెంటెడ్ డైరెక్టర్స్‌కు రామ్ ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదని పలువురు నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు..ఈ విషయం రామ్ ఏమంటారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: