టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన మారుతి తాజాగా పక్కా కమర్షియల్ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటించగా రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. దర్శకుడు మారుతి , సాయి ధరమ్ తేజ్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా తెరకెక్కిన ప్రతి రోజు పండగే సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మారుతి , సంతోష్ శోభన్ హీరోగా మెహరీన్ హీరోయిన్ గా మంచి రోజులు వచ్చాయి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన మంచి రోజులు వచ్చాయి సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది. దాంతో మంచి రోజులు వచ్చాయి సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా మారుతి దర్శకత్వం వహించిన పక్కా కమర్షియల్ సినిమా జులై 1 వ తేదిన విడుదల కాబోతుంది. మరి ఈ మూవీ తో మారుతి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. ఇది ఇలా ఉంటే రాశి కన్నా కూడా సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి రోజు పండగే సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటించింది.

సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక  బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఇలా ఆఖరుగా మారుతి , రాశి కన్నా ఇద్దరు కూడా ప్రతి రోజు పండగే సినిమాతో హిట్ లను అందుకున్నారు. ఆ తర్వాత మొవీల ద్వారా బాక్సాఫీస్ దగ్గర అపజయాలను ఎదుగుతున్న ఈ ఇద్దరు పక్కా కమర్షియల్ సినిమాతో విజయాలను అందుకోవాలి అని ఆశిస్తున్నారు. ఇలా ఈ ఇద్దరు కూడా పక్కా కమర్షియల్ సినిమాపైనే ఆశలు అన్ని పెట్టుకున్నారు. మరి పక్కా కమర్షియల్ సినిమా ఈ ఇద్దరికీ ఇలాంటి విషయాన్ని అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: