యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో మనందరికి తెలిసిందే .ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.ఇదిలావుంటే గతం లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వివి వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో సాంబ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.ఇక  ఆది కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇకపోతే భూమిక, జెనీలియా సాంబ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఒక సన్నివేశంలో వినాయక్ వదిన మరిది మధ్య బంధాన్ని అసభ్యంగా చూపించారు. కాగా కథ ప్రకారం ఆ సన్నివేశం బాగానే ఉన్నా చాలామంది ప్రేక్షకులు ఆ సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇకపోతే ఈ ఒక్క తప్పు సాంబ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైంది.

ఇదిలావుంటే వినాయక్ సైతం పలు ఇంటర్వ్యూలలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈ విషయాలను వెల్లడించారు.ఇక  ఈ సినిమాలోని మరికొన్ని సన్నివేశాలు సైతం జూనియర్ ఎన్టీఆర్ వినాయక్ రేంజ్ కు అనుగుణంగా అయితే లేవని కామెంట్లు వ్యక్తమయ్యాయి.కాగా  నిర్మాతకు ఈ సినిమాకు బిజినెస్ బాగానే జరగడం వల్ల లాభాలు మిగిలినా వినాయక్ కెరీర్ కు మాత్రం ఈ సినిమా అస్సలు ఉపయోగపడలేదని చెప్పాలి.పోతే ఆ తర్వాత వినాయక్ పలు సినిమాలతో విజయాలను అందుకున్నా ప్రస్తుతం వినాయక్ కెరీర్ ఆశాజనకంగా లేదనే సంగతి తెలిసిందే. ఇక వినాయక్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిలావుంటే ప్రస్తుతం వినాయక్ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ ఆ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. అయితే వినాయక్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకుంటారో లేదో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: